తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman: హనుమాన్‌ డైరెక్టర్‌కు రూ.1000 కోట్ల ఆఫర్‌.. నిజమేనా?

‘హనుమాన్‌’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. హనుమాన్‌ మూవీ చూసిన ఓ ఎన్నారై ఈ ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఇండియన్ కల్చర్, ఇతిహాసాలతో సినిమా చేస్తానంటే రూ.1000 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారంట. అయితే బడ్జెట్‌ ముఖ్యం కాదు. పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించామా లేదా అనేది ముఖ్యం. అలాగే నిర్మాత మొద‌ట‌ చెప్పిన బ‌డ్జెట్‌లో నేను సినిమా తీయలేను. ఎందుకంటే అప్పుడప్పుడు బడ్జెట్ ఎక్కువ కూడా కావ్వొచ్చు. ఈ విషయం మొదట్లోనే నిర్మాతలకు చెబుతాను’ అంటూ ప్ర‌శాంత్ తెలిపాడు.

ALSO READ: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. విషెస్ చెప్తున్న ఫ్యాన్స్

‘జై హనుమాన్‌’ సినిమా..

తేజ సజ్జా హీరోగా న‌టించిన ‘హనుమాన్‌’ సంక్రాంతి కానుక‌గా జన‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ కొట్టింది. ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.275 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. త్వరలో రూ.300 కోట్ల క్ల‌బ్‌లోకి దూసుకుపోతుంది. కాగా, ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో ‘జై హనుమాన్‌’ సినిమా రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button