తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nikhil Siddarth: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. విషెస్ చెప్తున్న ఫ్యాన్స్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్య ప‌ల్ల‌వి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు నిఖిల్. ఈ వేడుక ఫోటోలను షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Also read: Rajinikanth: కడప జిల్లాలో రజినీకాంత్ మూవీ షూటింగ్.. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

నా భార్య పల్లవికి భారతీయ సంప్రదాయ ప్రకారం సీమంతం వేడుక జరిగింది. మేము త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు అందజేయండి.. అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్వయంభూ అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో హీరో నిఖిల్​ ఓ యుద్ధ వీరుడి పాత్రలో​ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నిఖిల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button