తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

HanuMan: హనుమాన్ మూవీ సంచలనం.. 15 రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హనుమంతుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. కేవలం 15 రోజుల్లోనే ఏకంగా రూ. 250 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also read: Guntur Kaaram: గుంటూరు కారం నుంచి మరో అప్డేట్.. ఏది మనదనుకుందాం అంటూ అమ్మ సాంగ్ రిలీజ్

ఇక రానున్న వారంలో కొత్త సినిమాల రిలీజ్ లేకపోవడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో త్వరలోనే ఈ మూవీ రూ. 300 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హనుమాన్ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్ రానుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ సీక్వెల్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్టు ప్రకటించాడు ప్రశాంత్. దీంతో మొదలుకాకముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక హనుమాన్ సీక్వెల్ లో హనుమంతుల వారి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తారని ప్రకటించగానే ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. మరి భారీ అంచనాలు మధ్య రానున్న జై హనుమాన్ మూవీ ఏ రేంజ్ హిట్ కానుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button