తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Himaja.. రేవ్ పార్టీ అనేది అసత్యం.. ఖండించిన యాంకర్ హిమజ

దీపావళి పండుగ పూట పరిశ్రమలో హిమజ (Himaja) ఇంట్లో రేవ్ పార్టీ అనే వార్త కలకలం రేపింది. హైదరాబాద్ నగర శివారులోని తన నివాసంలో రేవ్ పార్టీ నిర్వహించిందనే వార్తలు (News) బయటకు వచ్చాయి. ఆమె అరెస్టయ్యారని, ఆమెతోపాటు బిగ్ బాస్ ఫేమ్ నటీనటులు కూడా అరెస్టయ్యారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని హిమజ ఖండించింది. తన నివాసంలో అలాంటిది జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వీడియో (Video) రూపంలో ఆమె ఓ స్పష్టతనిచ్చింది.

Also Read పండుగ నాడు కలకలం.. యాంకర్ హిమజ నివాసంలో మద్యం పార్టీ?

‘అందరికీ దీపావళి (Diwali) శుభాకాంక్షలు. పండుగను (Festival) చాలా సంతోషంగా చేసుకుంటున్నా. నిన్న మా ఇంట్లో హౌస్ పార్టీని సంతోషంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. కుటుంబసభ్యులు, స్నేహితులను పిలుచుకుని పార్టీ ఇచ్చుకున్నా. అయితే ఎవరో సమాచారం ఇవ్వడంతో పోలీసులు (Police) మా ఇంటికి తనిఖీ చేసి వెళ్లిపోయారు. అంతే! కానీ దీనిపై కొందరు అసత్య వార్తలు (Fake News) ప్రచారం చేస్తున్నారు. రేవ్ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అది రేవ్ పార్టీ (Rave Party) కాదు. కానీ అలాంటి ప్రచారం చేయడం తప్పు. మేం సంతోషంగా దీపావళి చేసుకుంటున్నాం. కానీ మేం అరెస్టయ్యారని అరెసట్ చేయడం దారుణం. నేనేమిటో అందరికీ తెలుసు. ఇలాంటి ప్రచారం చేసేవాళ్లను వారి విజ్ణతకే వదిలేస్తున్నా’ అని హిమజ వీడియోలో తెలిపింది.

ఆమె స్పందనతో అసలు రేవ్ పార్టీ జరగలేదని స్పష్టమవుతోంది. హిమజ తన నివాసంలోనే (House) ఉండి దీపావళి పండుగ చేసుకుంటోంది. అయితే హిమజకు సంబంధించిన ఈ వార్తలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల హిమజ బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) మద్దతుగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఆమె నివాసంలో రేవ్ పార్టీ జరిగిందనే వార్తలతో బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఇతర పార్టీలు పోస్టులు చేశాయి. అయితే అసలు ఆ పార్టీ జరగలేదని స్పష్టత రావడంతో తొందరపడి విమర్శలు చేసి వారు వివాదంలోకి చిక్కుకున్నారు.

Also Read చెర్రీ నివాసంలో దీపావళి.. తరలివచ్చిన తారలు

One Comment

  1. борода во сне в исламе, брить бороду во сне женщине сонник воздушные шары много, сонник,
    воздушный шар с корзиной кратер тихо, кратеры на луне
    карта тройка мечей да или нет карты таро звезда прямая

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button