తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Indian 2: ఇండియన్ 2 డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌.. ఎవరు దక్కించుకున్నారంటే?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ ఇండియన్ 2’. ఈ చిత్రం కోసం కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఇండియన్‌ 2 గ్లింప్స్‌ ను విడుదల చేయగా.. వైరల్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా, ఇండియన్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం న్టెక్స్‌ దక్కించుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నెట్‌ప్లిక్స్ తెలియజేసింది.

ALSO READ: 100 కోట్ల క్లబ్ లోకి ‘హను మాన్’…

సేనాపతి ఈజ్‌ బ్యాక్‌..

నెట్‌ప్లిక్స్ విడుదల చేసిన ట్వీట్‌లో సేనాపతి ఈజ్‌ బ్యాక్‌.. ఈ సినిమా థ్రియాట్రికల్‌ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సందడి చేయనుంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, బ్రహ్మానందం, స‌ముద్రఖని, మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తుండగా.. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ తర్వాత విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button