తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kannappa: కన్నప్ప మూవీ నుంచి మరో అప్డేట్.. మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ జాయిన్

మంచు విష్ణు టైటిల్ రోల్ లో కనిపించనున్న భారీ భక్తి రస చిత్రం కన్నప్ప. భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అయితే తాజాగా మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

ఈ మూవీలో మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ జాయిన్ కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో చాలా కీలకమైన పాత్రల కోసం మోహన్ బాబు, తమిళ నటుడు శరత్ కుమార్ ను తీసుకున్నారు. ఇక హీరో శరత్ కుమార్ ను మూవీలోని ఓ కీలక పాత్ర కోసం ఎంపికి చేసినట్టు తెలుస్తోంది. తనదైన నటనతో.. తెలుగులో సుపరిచతమైన శరత్.. పరంపర వెబ్ సీరిస్ తో దుమ్ము దులిపేశాడు. ఇప్పుడు కన్నప్ప ప్రాజెక్టులోకి శరత్ కుమార్ ఎంట్రీతో కన్నప్ప మూవీకి మరింత బలం కలిగింది.

భక్త కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్, పార్వతిగా నయనతారను తీసుకున్నారట. ఈ మూవీలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ భాగమయ్యారు. మరోవైపు ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ తో పాటు బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ప్రాజెక్ట్ లో చేరి.. కథకు మెరుగులు దిద్దారు. దీంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button