తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Sowa Fish: ఒక్క చేపతో అదృష్టం తిరిగింది.. రాత్రికే రాత్రే సంపన్నుడు

అదృష్టం ఎప్పుడు ఎవరినీ వరిస్తుందో తెలియదు. అదృష్టం (Luck) వరిస్తుందని ఖాళీగా కూర్చుని ఎదురుచూడడం కాదు. కష్టపడుతుంటే అదృష్టం కలివస్తుంది. అంతేకానీ ఖాళీగా కూర్చొంటే రాదు. అలా కష్టపడిన ఓ మత్స్యకారుడికి (Fishermen) అదృష్టం కలిసి రావడంతో అతడి జీవితమే (Life) మారిపోయింది. రాత్రికి రాత్రే ధనవంతుడు అయ్మాయాడు. ఒక్క చేపతో (Fish) అతడు సంపన్నుడుగా మారాడు. చేపతో ధనవంతుడు కావడం ఆశ్చర్యంగా ఉందా? నమ్మండి ఇది నిజం. పాకిస్థాన్ (Pakistan) లో ఓ జాలరికి లభించిన అత్యంత అరుదైన చేపతో అతడు సంపన్నుడు అయ్యాడు. పట్టుకున్న చేప మరి అలాంటి ఇలాంటిది కాదు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి.

Also Read కలెక్టర్ అంటే ఈయనలా ఉండాలి.. గిరిపుత్రుల కోసం ఏం చేశాడంటే..

పాకిస్థాన్ లోని ప్రధాన నగరమైన కరాచీకి (Karachi) సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మత్స్యకారుడు హజీ బలోచ్ నివసిస్తున్నాడు. రోజు మాదిరి ఈనెల 6వ తేదీన అరేబియా సముద్రంలో (Arabian Sea) హజీ బలోచ్ చేపల వేటకు వెళ్లాడు. వల వేసుకుని పట్టుకుని వచ్చిన చేపలను కరాచీలోని నౌకాశ్రయం (Port)లో విక్రయానికి తీసుకువచ్చాడు. వాటిలో పరిశీలించగా అత్యంత అరుదైన ‘సోవా’ చేప (Sowa Fish) కనిపించింది. ఆ చేప చూడగానే వ్యాపారులు కొనేందుకు ఆసక్తి కనబర్చారు. అత్యంత అరుదైన చేప కావడంతో వేలం వేశారు. ఆ వేలంలో 7 మిలియన్ రూపాయలకు ఓ వ్యాపారి చేపను దక్కించుకున్నాడు. దాదాపు రూ.70 లక్షలకు పైగా వేలం పలకడంతో హజీ బలోచ్ హర్షం వ్యక్తం చేశాడు. లభించిన సొమ్మును తనతో పాటు కష్టపడిన తోటివారితో పంచుకుంటానని చెప్పడం విశేషం.

Also Read వీడెవడో మాక్స్ వెల్ ను మించినోడు! ఎలా కొట్టినా ఫోర్లు, సిక్స్ లే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button