తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Karthikeya: జూన్ చివరి వారంలో ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’!

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అంచనాలు కాస్త నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాయి. మే 31న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అప్డేట్ అందింది.

ALSO READ: జూన్ 14న ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్

కాగా థియేటర్లలో రిలీజైన నెల రోజు తర్వాతే ‘భజే వాయు’ వేగం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో ముందే ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే ఈ నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేయనుందని తెలుస్తోంది. ఒక వేళ ఈనెల ఆఖరి వారంలో రాకపోతే జూలై మొదటి వారంలో విడుదల కానుంది. ఇక ఈ మూవీలో తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కపిల్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button