తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mangalavaaram: టీవీలోనూ ‘మంగళవారం’ మూవీ బంపర్ హిట్..8.3 టీఆర్పీ రేటింగ్

ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మంగళవారం’. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 2023 నవంబర్ 17న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్‌లో కూడా మంచి హిట్ సాధించింది. తాజాగా, టీవీలో ప్రసారమై అదరగొట్టింది. మొదటి టీవీ ప్రీమియర్‌లో 8.3 టీఆర్పీని సాధించి సూపర్ హిట్‌ అయింది.

ALSO READ: దూసుకెళ్తున్న ‘ఓం భీమ్ బుష్’ టీజర్.. ఎలా ఉందంటే?

పోస్టర్ రిలీజ్..

థియేటర్, ఓటీటీలో అదరగొట్టిన ఈ మూవీ.. లేటెస్ట్‌గా టీవీలో కూడా ప్రసారమై ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ స్టార్ మాలో ప్రసారమైంది. ఈ మూవీలో దివ్యా పిళ్ళై, నందితా శ్వేత, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button