తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

OmBheemBush: దూసుకెళ్తున్న ‘ఓం భీమ్ బుష్’ టీజర్.. ఎలా ఉందంటే?

‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న మూవీ ‘ఓం భీమ్ బుష్’. ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే తాజాగా, ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో విడుదలై ఒకరోజు కూడా గడవకముందే 1 మిలియన్స్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది.

ALSO READ: మొదటిసారి రొమాంటిక్ సాంగ్‌లో నటించనున్న ‘సాయిపల్లవి’?

మార్చి 22న రిలీజ్..

ఈ టీజర్‌ విషయానికొస్తే.. ముగ్గురు శాస్త్రవేత్తలు ఓ వీడియోలో యాడ్ దాటవేసి, అక్కడ ఉన్న పేషెంట్‌ను పట్టించుకోకుండా యూట్యూబ్‌లో వీడియో చూసేందుకు సిద్ధమవుతుండగా టీజర్ ప్రారంభమవుతుంది. శ్రీవిష్ణు తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు మంచి రోల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి బ్యాంక్రోల్ చేయగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. సంగీతం సన్నీ ఎంఆర్ అందించగా.. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా చేశారు. ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button