తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

MEGA 156: చిరంజీవి సినిమా అప్డేట్.. టైటిల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో ‘మెగా 156’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే చివరగా భోళా శంకర్ తర్వాత చిరంజీవి చేస్తున్న తదుపరి సినిమాపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాగా, పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి మేకర్స్ కీలక విషయాన్ని వెల్లడించారు. సంక్రాంతి పండగ రోజున టైటిల్ అనౌన్స్‌మెంట్ రానుంది. జనవరి 15న సాయంత్రం 5 గంటలకు ‘మెగా 156’ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇస్తున్నామంటూ ప్రొడ్యూసర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.

ALSO READ: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్ రామ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వచ్చే సంక్రాంతికి రిలీజ్

ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మేకర్స్ అప్ డేట్ చెప్పడంతో ఆడియెన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విజేతలు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాంగ్స్ రాస్తున్నారు. కాగా, గతేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి భారీ హిట్ కొట్టిన చిరంజీవి.. ఈ సంక్రాంతికి ‘మెగా 156’ సినిమా టైటిల్ ప్రకటించి వచ్చే సంక్రాంతికి మళ్లీ సినిమాతో బరిలో నిలవనున్నారు. దీంతో మెగాస్టార్ గట్టిగానే వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేశారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button