తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devil Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్ రామ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ సినిమా డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహించాడు. కాగా, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు పాజిటివ్ టాక్ ఉండడంతో మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.

ALSO READ: వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి… హిలేరియస్‌గా “మిస్ పర్ఫెక్ట్” టీజర్

సెన్సార్‌లో కట్ సీన్స్..

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా రూ.35 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. కాగా, ఇప్పుడు ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సినిమాను ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌స్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు. ఇందులో సెన్సార్‌లో కట్ అయిన సీన్స్‌ను, డైలాగులను కూడా యాడ్ చేశారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button