తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Priyamani: ఆసక్తిగా ‘భామాకలాపం 2’ టీజర్… రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం’ సినిమా, ఆహా ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ప్రియమణి , శరణ్య ప్రదీప్ పాత్రలను దర్శకుడు అభిమన్యు తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ సిద్ధమైంది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని కలిగించింది.

Also Read: హనుమాన్‌ డైరెక్టర్‌కు రూ.1000 కోట్ల ఆఫర్‌.. నిజమేనా?

బాపినీడు – సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమా నుంచి రీసెంటుగా టీజర్ ను రిలీజ్ చేశారు. “అను మనం వదిలి వెళ్తున్నది మన పాత ఇంటినే కాదు, నువ్ చేసిన తప్పుల్ని. ఇవేవి కూడా మళ్లీ నా లైఫ్ లోకి తీసుకురానని మాటివ్వు” అనే డైలాగ్ తో ఈ టీజర్ షురూ అవుతుంది. “అనుపమ అనే నేను.. పక్కనవాళ్ల విషయాల్లో తలదూర్చనని, నా పని నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటానని మాట ఇస్తున్నాను” అంటూ ప్రియమణి చెప్తుంది. ఈ సినిమా కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

Also Read: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. విషెస్ చెప్తున్న ఫ్యాన్స్

అయినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదనే విషయం టీజర్ లోని మిగతా సన్నివేశాలను బట్టి అర్థమవుతోంది. ఈ సారి మరింత పవర్ఫుల్ విలనిజాన్ని జోడించారనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికే 1 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టిన ఈ టీజర్, అదే రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.‘భామాకలాపం 2’లో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆహా’ ఓటీటీ సంస్థతో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button