తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Suhas: సుహాస్ కు బంపర్ ఆఫర్.. మహానటితో సినిమాలో ఛాన్స్

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలర్ ఫోటో సినిమాతో సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సుహాస్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోగా వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో సూపర్ హిట్టు అందుకున్న సుహాస్.. ప్రస్తుతం శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలు చేస్తున్నాడు. నెల వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Also read: Ustaad Bhagat Singh: పవర్ ఫుట్ డైలాగ్స్ తో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్.. మూవీ గ్లింప్స్ ఔట్

ఇదిలా ఉంటే.. తాజాగా మరో బంపర్ ఆఫర్ కోటేశాడట సుహాస్. స్టార్ హీరోయిన్, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఉప్పు కప్పురంబు అనే సినిమా రానుంది. దర్శకుడు ఐవీ శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాధికా లావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలోని ఒక స్మశానాన్ని విస్తరించడం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్. సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలో కీర్తి సురేష్ కనిపించనున్నారని టాక్.

ఇక ఈ సినిమాలోనే మరో కీ రోల్ కోసం నటుడు సుహాస్ ను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో సుహాస్ కీర్తి సురేష్ కి పెయిర్ గా చేస్తున్నాడా.. లేక మరేదైనా ప్రత్యేకమైన రోలా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ న్యూస్ గురించి తెలుసుకున్న నెటిజన్స్ సుహాస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button