తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

OG: ఓజీ నుంచి సరికొత్త పోస్టర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే పవన్ ఈ సినిమాను పూర్తిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపు 70 % వరకు షూటింగ్ ను ఫినిష్ చేశారు. మధ్యలో పవన్ ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో కొంత బ్రేక్ ఇచ్చాడు.

Also read: Fighter Movie: ఫైటర్ మూవీకి కొత్త చిక్కులు.. లీగల్ నోటీసు పంపిన అధికారులు

ఇక ఈలోపు మేకర్స్.. సినిమాపై హైప్ పెంచడం కోసం ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక తాజగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న OG ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అంతేకాకుండా ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు. బ్లాక్ కలర్ కార్ ముందు బ్లాక్ కలర్ సూట్, చేతిలో టీ గ్లాస్.. గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి అలాంటోడు మళ్లీ వస్తున్నాడు అంటే.. ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button