తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Vyuham: ఆర్జీవీకి మళ్ళీ హైకోర్టులో చుక్కెదురు… వ్యూహం రిలీజ్‌కు నోచుకునేనా?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాలు నేపథ్యంతో వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వీటిలో మొదటి చిత్రం ‘వ్యూహం’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ టీడీపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో కేసు వెయ్యడంతో.. రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. జనవరి 11కి పోస్టుపోన్ అయ్యింది. కానీ ఇప్పటికీ కోర్టు నుంచి విడుదలకు అనుకూల తీర్పు రాకపోవడంతో.. సినిమా రిలీజ్ అవుతుందా అనే సందేహం మొదలయింది.

Also Read: గొడవపడటం మనకేమైనా కొత్తనా… బ్రేకప్ ఫస్ట్ టైయమా!: ట్రూ లవర్ ట్రైలర్

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈ నెల 9 లోగా సెన్సార్ బోర్డ్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ.. ఇటీవలే సింగిల్ బెంచ్ కోర్టు తీర్పును వెల్లడించింది. అదేవిధంగా సినిమాపై సెన్సార్ బోర్డు రివ్యూ చేసి నాలుగు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది చిత్ర యూనిట్.

Also Read: ‘గేమ్ ఆన్’ సినిమాను మెచ్చుకున్న మంత్రి మల్లారెడ్డి

కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం సినిమాను తెరకెక్కించారని లోకేష్ పిటిషన్‌లో తెలిపాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిర్మాత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తతం దానిపై కోర్టులో విచారణ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button