తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Manikandan: గొడవపడటం మనకేమైనా కొత్తనా… బ్రేకప్ ఫస్ట్ టైయమా!: ట్రూ లవర్ ట్రైలర్

వాలెంటైన్స్ డే సందర్భంగా యూత్ ను పలకరించడానికి ప్రేమకథా చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలోనే తమిళ సినిమా ‘ట్రూ లవర్’ చేరిపోయింది. మాణికందన్ – గౌరీ ప్రియ జంటగా ఈ సినిమా రూపొందింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఇదే టైటిల్ తో ఈ నెల 10వ తేదీన విడుదల చేయనున్నారు.

Also Read: ‘గేమ్ ఆన్’ సినిమాను మెచ్చుకున్న మంత్రి మల్లారెడ్డి

తాజాగా ‘ట్రూ లవర్’ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రతి ప్రేమ జంట బయట ఎలా ఉంటారో ఈ జంట కూడా అలాగే కనిపించారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ట్రైలర్ కనిపించింది. ట్రైలర్ తో ఈ మూవీ పై చిత్రబృందం మంచి హైప్ క్రియేట్ చేశారు. మణికందన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. అందుకు కారణం ఆయన నటించిన గుడ్ నైట్ మూవీ ఓటీటీలో దూసుకుపోవడమే. ఈ సినిమాలో ‘గురక’ సమస్యతో సతమతమయ్యే పాత్రలో అతని నటన ఆకట్టుకుంటుంది.

Also Read:  చిరంజీవి కోసం బెంగుళూరు నుంచి వచ్చిన కన్నడ స్టార్ హీరో

ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button