తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Yatra 2: ‘యాత్ర 2’ మేకింగ్ వీడియో రిలీజ్..టీమ్ హార్డ్ వ‌ర్క్ సూపర్?

వైఎస్సార్ బయోపిక్‌ ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తీసిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాను ఏపీ ప్రస్తుత సీఎం జగన్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీశారు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి న‌టించ‌గా.. సీఎం జగన్ పాత్ర‌లో కోలీవుడ్ హీరో జీవా నటించాడు. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు.

ALSO READ: ఇంట్రెస్టింగ్‌గా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ట్రైల‌ర్

మేకింగ్ అఫ్ యాత్ర 2..

మేకింగ్ అఫ్ యాత్ర 2 పేరిట ఈ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో జ‌గ‌న్ పాత్ర‌లో జీవాని సెల‌క్ట్ చేయ‌డం ద‌గ్గ‌ర‌నుంచి షూటింగ్ ముగింపు వ‌ర‌కు యాత్ర 2 ను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాలు, ఓదార్పు చేసేందుకు వెళ్లిన తీరు కళ్లకు కట్టినట్లు చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button