తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి బెయిల్.. కానీ ఇంకా జైళ్లోనే

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. గతేడాది సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించిన 12 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసులలో నిందితులు అందరూ బెయిల్‌పై ఉన్నందున ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో ఉంచడం సమర్థనీయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

Also read: Asaduddin Owaisi: అయోధ్య రామమందిరంపై చర్చ.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఈ కేసులో అరెస్టయిన పీటీఐ అధినేతకు రూ.5 లక్షల పూచీకత్తుపై ఏటీసీ జడ్జి మాలిక్ ఇజాన్ అసిఫ్ బెయిల్ మంజూరు చేశారు. పాక్ సైనిక జనరల్ ప్రధాన కార్యాలయాలు, ఆర్మీ మ్యూజియం‌పై దాడి సహా 12 కేసుల్లో మాజీ ప్రధానికి బెయిల్ లభించినట్టు పాక్ మీడియా పేర్కొంది. ఇదే కేసులో విదేశాంగశాఖ మాజీ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా 13 కేసుల్లో బెయిల్ మంజూరైంది. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఇమ్రాన్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తోషఖానా, అధికారిక రహస్యాల లీక్ కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.

ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారులు పాక్ ఎన్నికల్లో రాణించిన నేపథ్యంలో ఈ తీర్పు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కాగా ఆయన మద్దతుదారులు మే 9న దాడులకు దిగి భవనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనలపై ఇమ్రాన్‌ సహా 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button