తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే పదవికి.. పార్టీకి ఆర్కే రాజీనామా

ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యత్వానికి.. ఎమ్మెల్యే (MLA) పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.

Also Read కీలక మైలురాయికి లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర

స్పీకర్ (Speaker) కార్యాలయానికి సోమవారం చేరుకున్న రామకృష్ణారెడ్డి రాజీనామా (Resignation) పత్రాన్ని స్పీకర్ కార్యదర్శికి సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆర్కే పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ సీపీకి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశా. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ సమర్పించా. దీన్ని ఆమోదించాలని స్పీకర్ ను కోరా. రాజీనామాకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తా’ అని ఆర్కే మీడియాతో తెలిపారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై బహిరంగ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Also Read పవన్ కల్యాణ్ ను నేను తిట్టలే.. అదంతా అబద్ధం: కిషన్ రెడ్డి

కారణాలు ఇవేనా..?
అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,250 కోట్లు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి మొండిచేయి చూపారు. దీంతో కొన్నాళ్లుగా ఆర్కే (RK) అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. చాలా రోజుల నుంచి దాచుకున్న అసంతృప్తిని నేడు రాజీనామాతో బయటపెట్టారు. పార్టీ తనను అవమానించేలా చేస్తుందని ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. తాజాగా మంగళగిరి ఇన్ చార్జ్ గా గంజి చిరంజీవికి (Ganji Chiranjeevi) పార్టీ బాధ్యతలు అప్పగించడంతో రామకృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. పొమ్మనలేక పొగబెట్టడంతో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button