తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Samantha: అనాథ పిల్లల కోసం హాయ్ నాన్న… సమంత ఔదార్యానికి అంతా ఫిదా

తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని నుంచి వచ్చిన చిత్రం హాయ్‌ నాన్న. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించగా.. బాలీవుడ్ భామ మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్ గా చేసింది. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి , డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ తెరకెక్కించారు.

Also Read: నాని రీసెంట్ మూవీ కలెక్షన్స్.. ఐదు రోజుల్లో ఎంతంటే?

ఈ సినిమాకు ఇంప్రెస్ అయిన స్టార్ హీరోయిన్ సమంత అనాథ చిన్నారుల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. సామ్‌ హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిన్నారుల కోసం హాయ్‌ నాన్న స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయడం ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలిచింది. చిన్నారుల ముఖాల్లో ఆనందాన్ని చూసేందుకు సామ్‌ చూపిస్తున్న ఔదార్యానికి అందరూ సెల్యూట్‌ చేస్తున్నారు.

Also Read: మహేశ్‌బాబు లేటెస్ట్ మూవీ నుంచి ‘ఓ మై బేబీ’ సాంగ్‌ ప్రోమో

హాయ్‌ నాన్న మూవీ బాగుందనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు కన్నా మూడో రోజు హాయ్ నాన్న కలెక్షన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఈ సినిమాకి డిసెంబర్ 22 వరకూ పోటీ లేదు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ కంటే దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సలార్ రిలీజ్ కావడానికి ఇంకా పది రోజుల సమయం ఉండటంతో హాయ్ నాన్న కు మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button