తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: మార్చిలోనే పది, ఇంటర్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే!

ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలు మార్చి నెలలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయవొచ్చని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక పదో తరగతి పరీక్షలకు 6.23 లక్షల మంది, ఇంటర్ ఫస్టియర్ కి 5,29,457 మంది, ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,76,198 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు.

Also read: CM Jagan: ఉద్దానం ప్రజలకు ఆపన్న హస్తం.. నేటితో సమస్యలకు చెక్

ఇక మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ థియరీ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖారారు చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి మార్చి 31 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించబడుతాయని అన్నారు. ఈసారి పరీక్షలు పకడ్భందీగా నిర్వహిస్తామని.. ఎవరైనా లీకేజ్ వ్యవహారాలకు పాల్పపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూల్:

మర్చి 18- మొదటి భాష

మార్చి 19- రెండో భాష

మార్చి 20- ఇంగ్లీష్

మార్చి 22- మ్యాథ్స్

మార్చి 23- ఫిజిక్స్, కెమిస్ట్రీ

మార్చి 26- బయాలజీ

మార్చి 27 సోషల స్టడీస్

మార్చి 28- కాంపొజిట్ లాంగ్వేజ్-2, సంస్కృతం, అరబిక్, పార్శీ-1

మార్చి 30- సంస్కృతం, అరబిక్, పార్శీ-2, ఓకేషనల్ కోర్స్ థియరీ

ఇంటర్ పరీక్షల షెడ్యూల్:

మార్చి-1 ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్

మార్చి-2 సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్

మార్చి-4 ఫస్టియర్ ఇంగ్లీష్

మార్చి-5 సెకండియర్ ఇంగ్లీష్

మార్చి-6 ఫస్టియర్ మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్

మార్చి-7 సెకండియర్ మ్యాథ్స్- ఏ, బోటనీ, సివిక్స్

మార్చి- 9 ఫస్టియర్ మ్యాథ్స్- బీ, జువాలజీ, హిస్టరీ

మార్చి-11 సెకండియర్ మ్యాథ్స్- బీ, జువాలజీ, హిస్టరీ

మార్చి-12 ఫస్టియర్ ఫిజిక్స్, ఎకనామిక్స్

మార్చి-13 సెకండియర్ ఫిజిక్స్, ఎకనామిక్స్

మార్చి-14 ఫస్టియర్ కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్

మార్చి-15 సెకండియర్ కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్

మార్చి-16 ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్

మార్చి-18 సెకండియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జికోర్స్ మ్యాథ్స్

మార్చి-19 ఫస్టియర్ మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

మార్చి-20 సెకండియర్ మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button