తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Education: విద్యా వ్యవస్థలో మరో ఘట్టం.. ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం

పేద విద్యార్థులను గ్లోబల్‌ స్థాయిలో సగర్వంగా నిలబెట్టేందుకు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ఇందులో భాగంగా ఎస్‌సీఈఆర్టీలోకి ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌(ఐబీ) భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విద్యా రంగంలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనతోపాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సీఎం జగన్‌.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో ధనవంతులు పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ను సర్కార్​ బడుల్లో చదివే విద్యార్థులకు చేరువ చేయడంతో ఏపీ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది.

ALSO READ: కేబినెట్ మీట్‌.. మంత్రి చెల్లుబోయిన ఏమన్నారంటే?

ఐబీతో విప్లవాత్మక మార్పులు

ఐబీ విద్యతో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ఓ సాధారణ ఐబీ పాఠశాలలో చదవాలంటే ఏడాదికి దాదాపు రూ.4 నుంచి 5 లక్షలు ఖర్చవుతుంది. కానీ ఇవాళ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఎస్‌సీఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి ఆమోదం తెలపడంతో ఏపీ రూపు రేఖలు మారనున్నాయి. అయితే కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదివే ఐబీని ఏపీ విద్యావ్యవస్థలోకి తీసుకురావడంతో పేద విద్యార్థుల కమ్యునికేషన్ స్కిల్స్ సైతం అంతర్జాతీయ స్థాయిలో పెరగనున్నాయి. అదే విధంగా పేద విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడడంతోపాటు అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉండనుందని విద్యా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: జ్ఞానవాపి మసీదు కేసు.. వారణాసి కోర్టు సంచలన తీర్పు

ఉపాధ్యాయులు, సిబ్బందికి శిక్షణ

ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌(ఐబీ) బోధనపై ఉపాధ్యాయులు, సిబ్బందికి సర్కార్ శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు 2024-25లో టీచర్ల సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా శిక్షణ అందించనుంది. 2025 జూన్ నుంచి 1వ తరగతిలో ఐబీ విద్య ఉండనుంది. అదే విధంగా 2026లో రెండో తరగతి.. ఇలా 2035 నాటికి పదో తరగతిలో కూడా ఐబీ విద్య అందుబాటులోకి రానుంది. కాగా, ఉపాధ్యాయ, విద్యాశాఖ అధికారులకు కూడా ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button