తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: శర్వానంద్ నెక్ట్స్ మూవీపై అప్‌డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీలో యంగ్ హీరో

టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీరామ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా మూవీ బాబ్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శర్వానంద్ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. శర్వానంద్ కి కథ వినిపించి ఓకే చేసుకున్న ఆ దర్శకుడు రామ్ అబ్బరాజు. గత ఏడాది ఆయన నుంచి ‘సామజవరగమన’ సినిమా వచ్చింది. శ్రీవిష్ణు – రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి వినోదభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత ఆయన రెడీ చేసుకున్న కథ ఇదే.

Also Read: ఓటీటీలోకి వెంకటేశ్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

ఈ సినిమాను నిర్మించడానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు వచ్చినట్టుగా సమాచారం. ట్రయాంగిల్ లవ్ స్టోరీని కొత్త కోణంలో చూపించనున్నారని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే ఈ సినిమాలో కథానాయికలుగా సంయుక్త మీనన్ – సాక్షి వైద్య కనిపించనున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button