తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారా..?

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ వైసీపీతోపాటు టీడీపీ తమ బలగాలతో సిద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈసారి ఎలాగైనా గెలవాలని కసరత్తు చేస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో వైసీపీ సర్కార్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి ఇవే అధికారాన్ని అందిస్తాయని వైసీపీ బలంగా నమ్ముతుంది. కాగా, ఒకవేళ చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల అమలు ఏంటనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

ALSO READ: ప్రజాపాలన దరఖాస్తులకు ఈరోజే ఆఖరు.. గడువు పెంపు ఉంటుందా?

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నిజమే!

ఏపీ ఎన్నికల నేపథ్యంపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారని గతంలో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వార్తలు ఏంటంటే.. ‘ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం పథకాలు అనేవి ఇవ్వదు. ఎందుకంటే దాదాపుగా 2 లక్షల కోట్లు డీబీటీ రూపంలో పేదలకు ఇచ్చాం అంటున్న జగన్.. ఒకవేళ ఓడిపోతే మళ్లీ అవే పథకాలు కొనసాగించే పిచ్చివారు కాదు చంద్రబాబు’ అంటూ జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపించాయి. కాగా, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా లేదా అనే వార్తలు ఎంతవరకు నిజమో తెలీదు కానీ, ఈ నిజం మాత్రం ప్రజలకు తెలియాలి. లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థం అవుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: బాబుకు భారీ షాక్.. టీడీపీకి కేశినేని నాని రాజీనామా

వెనక్కి తగ్గని వైసీపీ సర్కార్

ఏపీలో ప్రస్తుతం వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఏపీలో అమలు అవుతున్న పథకాల జోలికెళ్లేందుకు ఇతర రాష్ట్రాలు సాహసించడం లేదు. అయితే ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ పథకాలు అమలు చేసేందుకు సాహసం చేస్తాయా? అనే విషయంపై చర్చ నడుస్తోంది. ఇటీవల తెలంగాణలోనూ ఇదే ధోరణి కనపపడుతోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేందుకు ఇబ్బంది పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రైతు బంధు, డబుల్ బెడ్రూం, దళిత బంధు వంటి పథకాలకు సంబంధించి ఇంకా కసరత్తు కొనసాగుతోంది. అయితే ఏపీ ప్రజలు కూడా ఎవరికి ఓటు వేయాలనే కొత్త ఆలోచనలో పడినట్లు సమాచారం. కానీ, వైసీపీ సర్కార్ మాత్రం పథకాల అమలుపై వెనక్కి తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఈ పథకాలు కీలకంగా మారన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button