తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Samantha: లక్కీ ఛాన్స్ కొట్టేసిన సమంత.. త్రిష ఔట్!

సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈబ్యూటీ డీసెంట్ హిట్ అందుకున్నారు. ఇక బాలీవుడ్ నుండి సైతం క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ హిందీ వర్షన్ లో నటిస్తున్న సమంత.. చెన్నై స్టోరీస్ అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నారట.

Also read: Bhimaa: గోపిచంద్ లేటెస్ట్ మూవీ అప్డేట్.. భీమా టీజర్ రిలీజ్

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ది బుల్ సినిమా చేస్తున్నారు. ఆర్మీ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందునుండి త్రిష పేరు వినిపించింది. దాదాపు ఖరారైంది అనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ స్థానంలో సమంత పేరు వినిపిస్తోంది.

కారణం త్రిష కన్నా సమంతకు బాలీవుడ్ లో ఫోలియింగ్ ఎక్కువుగా ఉండటమే. గతంలో ఆమె ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ భారీ విజయాన్ని సాధించింది. దీంతో సమంతకు బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ కారణంగానే త్రిష స్థానంలో సమంతను తీసుకున్నారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button