తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం.. వైసీపీ కీలక సమావేశం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ స్థానాలతోపాటు 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల్లో అనుసరించా­ల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు కాసేపట్లో సీఎం జగన్ దిశా­నిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగి­రిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి సచి­వా­లయ కన్వీనర్లతో దాదాపు 2,700 మందికితో భేటీ కానున్నారు.

ALSO READ: 35 ఏళ్ల పాలనలో కుప్పానికి ఏమైనా మంచి జరిగిందా?

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం..

ఎన్నిక­ల్లో క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రతీ నియోజకవర్గంలో పార్టీ గెలిచేందుకు చేపట్టే కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేందుకు చేసిన కృషిని తెలియజేసేలా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే 2019 కంటే ముందు, ఆ తర్వాత వచ్చిన మార్పులు కళ్లకు కట్టినట్లు చూపించేలా.. ప్రతీ కుటుంబాన్ని బూత్ కమిటీ సంప్రదించి వారికి ప్రభుత్వంలో అందిన లబ్ధి వివరించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ALSO READ: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ

పెరుగుతున్న ఆదరణ..

‘సిద్ధం’ సభల సక్సెస్ కావడంతో వైసీపీపై ఆదరణ పెరుగుతోంది. దీంతోపాటు సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తుండటంతో వై­సీపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రకటన, మరో వైపు సిద్ధం సభలతో మరింత దూకుడుగా దూసుకెళ్తోంది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ టార్గెట్‌గా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అంతకుముందు క్లీన్‌ స్వీపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని 2022 మే 11న ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పట్టిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button