తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: రూట్ మార్చిన బాబు.. తిట్టిన నోటితోనే మోదీపై పొగడ్తల వర్షం!

టీడీపీ నేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, జనసేన.. ఇలా అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్న ఆయన ఎత్తుగడలో భాగంగా వాటితో తెగదెంపులూ చేసుకున్నాడు. మళ్లీ రానున్న ఎన్నికల్లో చాలా తెలివిగా బీజేపీతో జత కట్టాడు. చంద్రబాబు తన పొత్తుల మ్యాజిక్‌లో భాగంగా పల్నాడు జిల్లా బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, అంతకుముందు నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది అని పలికిన బాబు.. పొత్తు తర్వాత ఒక్కసారిగా రూట్ మార్చాడు. ఏదైనా వెన్నుపోటు రాజకీయం బాబు తర్వాతేనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ:  సీఎం కీలక భేటీ.. ఎన్నికల ప్రచారంపై వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో చర్చ

పొగడ్తల వర్షం

మోదీని కాకా పట్టడానికి బాబుతోపాటు పవన్ కూడా పోటీపడ్డారు. బాబు కొన్ని మాటలు రాసుకొచ్చి హిందీలో చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక వ్యక్తి కాదు.. దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న శక్తి. మోదీ అంటేనే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ, భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమని మెచ్చుకున్నారు. ‘సబ్‌ కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌- సబ్‌ కా విశ్వాస్‌’ నినాదంతో దేశానికే నమ్మకం కల్పించిన శక్తిమంతమైన నాయకుడు మోదీ. కోవిడ్‌ సంక్షోభం సమయంలో ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా పనిచేసి దేశ ప్రజల ప్రాణాల్ని రక్షించారు. వంద దేశాలకు టీకాలు పంపించి దేశ సమర్థత చాటాడని పొగడ్తల వర్షం కురిపించారు.

ALSO READ: కొత్త మేనిఫెస్టో రూపకల్పన..మార్చి 20న విడుదల

తలవంచుకొని ఢిల్లీ వెళ్లా..

నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదని, భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు మోదీ వస్తే ముస్లింలు బతకరని గతంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. విభజన హామీలను నాలుగు బడ్జెట్‌లలో పట్టించుకోలేదని, రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లానని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవని, హోదా ఎగ్గొట్టి 2 పాచి పోయిన లడ్లు ఇచ్చాడని, పోలవరంను ఏటీఎం లాగా వాడుకొంటూ దోచుకున్నాడని బాబు అన్నారు. అయితే కొత్త కొత్త పొత్తులు కుదుర్చుకోవడంలోనూ వదిలేయడంలో చంద్రబాబు మించినోడు లేడని పలువురు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

Back to top button