తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: కాంగ్రెస్‌కు ఆర్కే గుడ్‌బై.. కారణం అదేనా!

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మంగళగిరిలో టికెట్ విషయంలో వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైసీపీలో చేరారు. ఇవాళ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకున్న ఆర్కే.. సీఎం జగన్‌ను కలిసి పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో వైసీపీ గెలుపొందేందుకు పనిచేస్తానని ప్రకటించారు.

ALSO READ: వైసీపీలోకి వలసల పర్వం.. టీడీపీ నుంచి కీలక నేతలు!

కాంగ్రెస్‌లో ఉన్నా.. టీడీపీలో ఉన్నట్లు అనిపించేది!

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన షర్మిలకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే వైఎస్సార్ ఆశయాల కోసం షర్మిల పనిచేస్తున్నారనుకున్నా.. కానీ కాంగ్రెస్‌లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ఆర్కే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. తనకు టీడీపీలో ఉన్నట్లే అనిపించేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలకు స్వయంగా చూసిన ఆయన ఆందోళనకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వచ్చిన షర్మిలకు ఉపన్యాసాల నుంచి కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు సైతం ప్రతిరోజూ టీడీపీ కార్యాలయం నుంచి రావడంతో ఒక్కసారి ఆశ్యర్యానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయని, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే పనులు కాకుండా టీడీపీకి ఎక్కువగా లాభం చేకూర్చే విధంగా నాయకులు వ్యవహరించడం తట్టుకోలేని ఆర్కే.. తిరిగి సొంతగూటికి చేరారని సమాచారం.

ALSO READ: మరాఠాలకు 10 రిజర్వేషన్.. మహారాష్ట్ర అసెంబ్లీ అమోదం

టీడీపీ అజెండాలోనే షర్మిల?

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే షర్మిల పార్టీలోకి రావడంతో ఆర్కే కూడా ఆమెపై అభిమానంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు మొదటి రోజే బెడిసి కొట్టిందని తెలుస్తోంది. అదే రోజు జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశంలో ఆయనను ఆహ్వానించకపోవడంతోపాటు కనీసం లోపలికి కూడా పిలవలేదని సమాచారం. దీంతోపాటు సమావేశంలో దాదాపుగా టీడీపీ పార్టీకి మద్దతు పలికేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ఆర్కే.. కోపంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లోకి వెళ్లి నెల వ్యవధి కాకముందే తిరిగి సొంత గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button