తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP: స్పీకర్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశారు. వీరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. అయితే వీరంతా పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదులతోనే స్పీకర్ అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో శాసనసభలో ఎనిమిది స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటించారు.

ALSO READ: అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం.. వైసీపీ కీలక సమావేశం

రాష్ట్ర విభజన తర్వాత ఇదే ఫస్ట్ టైం..

రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్‌ విప్‌ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా.. టీడీపీలో అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ విప్‌ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివరణలు తీసుకుని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

ALSO READ: తెలంగాణ నుంచే రాహుల్ గాంధీ పోటీ?

వైసీపీ ఎమ్మెల్యేలు..

1. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి – నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం

2. ఆనం రామనారాయణరెడ్డి – వెంకటగిరి

3. మేకపాటి చంద్రశేఖరరెడ్డి – ఉదయగిరి

4. ఉండవల్లి శ్రీదేవి – తాడికొండ

టీడీపీ ఎమ్మెల్యేలు..

1. వాసుపల్లి గణేష్‌కుమార్‌ – విశాఖ దక్షిణ

2. కరణం బలరాం – చీరాల

3. మద్దాల గిరి – గుంటూరు వెస్ట్‌

4. వల్లభనేని వంశీ – గన్నవరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button