తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Kuppam: గాల్లో మేడలు కడుతున్న బాబు.. కుప్పంలో ఈసారి కష్టమే?

గాల్లో మేడలు కట్టాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా ఉంటారు. అరచేతిలో వైకుంఠం చూపడంలో ఆయన్ను మించిన వారు మరొకరు ఉండరు. తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే భావన ఏర్పడుతుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగం చేశారు. ఆయన తన సహజసిద్ధమైన శైలిలో కుప్పంపై హామీల వర్షం కురిపించారు. ‘కుప్పం పట్టణానికి విమానాశ్రయం తీసుకొస్తా’ అని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా ఆ విమానాల ద్వారా కుప్పం ప్రజలు కూరగాయలు విదేశాల్లో అమ్ముకోవచ్చని ప్రకటించారు. ఇలా ఇష్టారీతిన నోటికి ఎంతొస్తే అన్ని హామీలు ఇచ్చి ప్రజల ముందు మరోసారి నవ్వులపాలయ్యారు.

Also Read అదంతా తప్పు.. నేను రాజీనామా చేయడం లేదు: గవర్నర్ తమిళిసై

అసలు కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబుకు ప్రేమే లేదు. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తున్న బాబు ఏనాడూ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. 1989 నుంచి 2019వరకు ఓటమి ఎరుగకుండా కుప్పం నుంచి చంద్రబాబు గెలుస్తున్నారు. కానీ ఏనాడూ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉండీ కూడా సొంత నియోజకవర్గంపై ఏనాడూ శ్రద్ధ చూపలేదు. అంతెందుకు సొంత నియోజకవర్గంలో ఇప్పటివరకు చంద్రబాబుకు సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం.
గెలిపించిన ప్రజలపై ఏనాడూ ప్రేమ చూపని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మళ్లీ వచ్చి ప్రచారం చేయడాన్ని ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.

Also Read గ్యారంటీలు అమలు చేస్తారా? లేదా? ఎమ్మెల్సీ కవిత నిలదీత

35 ఏళ్లుగా గెలుస్తున్నా చంద్రబాబు ఏనాడూ కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేసుకోలేకపోయారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేశాడు. అనంతరం రెవెన్యూ డివిజన్ గా కూడా చేశాడు. ఇవన్నీ చంద్రబాబు చేయలేదు. అలాంటి బాబు ఇప్పుడు ‘ఎయిర్ పోర్టు కట్టిస్తా’ అని ప్రకటించడం నవ్వులు తెప్పిస్తోంది. నియోజకవర్గాన్ని ఏనాడూ అభివృద్ధి చేయని చంద్రబాబును ఈసారి కుప్పం ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లోనే అతి తక్కువ మెజార్టీతో చంద్రబాబు గట్టెక్కిన విషయం తెలిసిందే. ఈసారి బాబును ఓడించేందుకు వైసీపీ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. ఈసారి చంద్రబాబుకు కుప్పం ప్రజలు శఠగోపం పెట్టే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button