తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Nag Ashwin: ప్రభాస్ కల్కి ట్రైలర్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో, ఇండియన్ మైథాలజీకి లింక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందని టీజర్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ నాగ్.

Also read: Anushka Shetty: ఉమెన్ సెంట్రిక్ మూవీలో అనుష్క.. త్వరలో ప్రారంభం కానుందా?

తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన టెక్ ఫెస్ట్’23లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో కల్కి 2898 AD కి సంబంధించిన ప్రత్యేక కంటెంట్ ను కూడా ప్రదర్శించారు. అనంతరం అక్కడి మీడియాతో ముచ్చటించిన నాగ్ అశ్విన్.. కల్కి గురించి, ఆ సినిమాకు ఉపయోగించిన టెక్నాలజీ గురించి, విజువల్ ఎఫెక్ట్స్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కల్కి ట్రైలర్ అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. కల్కి సినిమా రిలీజ్ డేట్ అతిత్వరలో ప్రకటిస్తామని.. మరో 93 రోజుల్లో కల్కి ట్రైలర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. అంటే ఏప్రిల్ 1 నాటికి ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button