తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TTD: టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదం.. పాలకమండలి భేటీలో కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 5141 కోట్ల రూపాయల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాల్లర్లు తరహలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. టీటీడీ పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులుకు స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ 15 వేల రూపాయలు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను 35 వేల నుంచి 54 వేలకు పెంచుతున్నట్లు తెలిపింది.

Also read: Tollywood Producer: జనసేనలోకి ప్రముఖ నిర్మాత.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్

ఇక, టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు.. టీటీడీ పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేసింది. అలాగే రూ.30 కోట్ల వ్యయంతో గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణం చేసేందుకు అనుమతిచ్చింది. నారాయణవనంలో వీరభధ్రస్వామి ఆలయం అభివృద్దికి 6.9 కోట్ల రూపాయలు కేటాయింపుతో పాటు స్విమ్స్ అభివృద్ది పనులకు 148 కోట్లు కేటాయించింది. 2.5 కోట్ల రూపాయలతో సప్తగిరి అతిథి గృహలు అభివృద్ది పనులకు కేటాయించినట్లు టీటీడీ పేర్కొనింది. ఎస్ఎంసీ, ఎస్ఎస్సీ కాటేజీల అభివృద్ది పనులకు 10 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే, వాటర్ వర్క్స్ తో పాటు అన్నప్రసాదం, టీటీడీ స్టోర్స్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు చేశారు.

వేదపాఠశాలలో ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ తెలిపింది. వేద పండితుల పెన్షన్ 10 వేల నుంచి 12 వేలకు పెంపు.. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంపుతో పాటు 56 వేదపారయణదారులు పోస్టుల నియామకానికి నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతు టీటీడీ తీర్మానం చేసింది. ఇక, ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తూన్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సదస్సుకు 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సుకు హజరవుతారని వెల్లడించారు. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలు, సలహాలను టీటీడీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button