తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YS Sharmila: సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అతడి సోదరి పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఎక్స్‌ వేదికగా మరోసారి వ్యంగస్త్రాలు సంధించారు. విశాఖ ప్రజలను మోసం చేసేందుకు విశాఖ విజన్‌ పేరిట కొత్త నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖ విజన్‌ గళం ఎత్తుకుంటున్నాడని దుయ్యబట్టారు. రాజధానిలో ఇన్నాళ్లు పాలనను ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు.

Also Read: రేవంత్ ప్రజలనే కాదు… కాంగ్రెస్‌ను మోసం చేస్తున్నాడు: హరీశ్ రావు

ఆంధ్రుల తలమానికమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం తమ విజనంటూ మండి పడ్డారు. రైల్వే జోన్‌ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం వారికి ప్రాక్టికలని , ఐటీ హిల్స్‌ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా.. చూస్తూ ఉండటం రోడ్‌ మ్యాపని ఆరోపించారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైఎస్ఆర్సీపీ విజన్ అని పేర్కొన్నారు.

One Comment

  1. к чему снится украсть рюкзак, рюкзак во сне ванга ст 112 ук
    рф субъективная сторона, статья 112 ук рф что грозит тест на кин из салли фейс водолей дата
    с какого числа как узнать о чувствах
    человека по картам таро, расклад на чувства мужчины таро схемы

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button