తెలుగు
te తెలుగు en English
జాతీయం

DK Shivakumar: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు బారీ ఊరట… విచారణ నిలిపివేత

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో శివకుమార్‌పై నమోదైన మనీలాండరింగ్‌ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఆయనపై విచారణను నిలిపివేయాలని ఈడీని సుప్రీం ఆదేశించింది. డీకే నుంచి రికవరీ చేసిన నగదు మూలాన్ని కనుగొనడంలో దర్యాప్తు సంస్థ విఫలమయ్యిందని ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read: కేసీఆర్‌తో బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ…కలిసి పోటీ చేయనున్నారా?

2017లో డీకేతోపాటు అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ సోదాల్లో దాదాపు 300 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఈ కేసును ఈడీ తన ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టింది. 2018లో డీకేపై ఈడీ మ‌నీలాండరింగ్ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో 2019లో అతన్ని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అయితే ఆ త‌ర్వాత నెల రోజుల‌కే ఢిల్లీ హైకోర్టు శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button