తెలుగు
te తెలుగు en English
జాతీయం

Hathras: యూపీలోని హాథ్రస్‌ తొక్కిసలాటపై భోలే బాబా ఏమన్నారంటే?

ఉత్తరప్రదేశ్‌‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో నిన్న జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన జరిగిన ఒక రోజు అనంతరం భోలే బాబా ఇవాళ దీనిపై స్పందించారు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నారు. అంతేకాకుండా ఈ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ‘ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు.

ALSO READ:  కలకలం సృష్టిస్తున్న ‘జికా’ వైరస్.. రాష్ట్రాలకు కేంద్రం హైఅలెర్ట్!

అసలేం జరిగింది?

యూపీలోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలోని ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి సత్సంగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 80వేల మంది వరకు హాజరయ్యేందుకు పోలీసులు దీనికి అనుమతినిచ్చారు. కానీ మంగళవారం 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చారని, దీంతోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటుచేశారు. మరోవైపు, హాథ్రస్‌ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్‌ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button