తెలుగు
te తెలుగు en English
జాతీయం

Vijay Thalapathy: కొత్త పార్టీ పెడుతున్న స్టార్ హీరో.. ఫ్యాన్స్ మధ్య జోరుగా ప్రచారం

తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అదే ఇలయ దళపతిగా పేరుతెచ్చుకున్న విజయ్ కు తమిళనాట విశేషంగా అభిమానులు ఉన్నారు. అయితే ఆయన త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంతా కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు హీరో విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లైంది.

Also read: Mohmood Ali: గణతంత్ర వేడుకల్లో అపశృతి.. కిందపడిపోయిన మాజీ మంత్రి

ఇకపోతే మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత.. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో నటనతోపాటు సేవా కార్యక్రమాలతో విజయ్‌ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఈ మధ్యే వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు.

అదే విధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్‌లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఇక ఇప్పటికే సీనియర్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వద్దామని వెనుకంజ వేశారు. వీళ్లిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం ఉన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. ఇక రాజకీయాల్లోకి వస్తే.. విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తాడా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button