తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Sapta Sagaralu Daati- Side B: ఓటిటిలోకి వచ్చిన సప్త సాగరాలు దాటి- సైడ్ బీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కన్నడ హీరో రక్షిత్ శెట్టి 777 చార్లీ మూవీ తో దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మూవీలో రక్షిత్ శెట్టి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత సప్త సాగరాలు దాటి సైడ్ ఏ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఇటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా మంచి విజయం సాధించింది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా.. హేమంత్ దర్శకత్వం వహించారు. సైడ్ ఎ చిత్రానికి సీక్వెల్ గా మేకర్స్ ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ ను తీసుకువచ్చారు. గతేడాది నవంబర్ 17న రిలీజ్ అయిన సైడ్ బి మూవీ సూపర్ హిట్ అయ్యింది. కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సూపర్ హిట్ మూవీ ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే ఓటీటీ రిలీజ్ పై హీరో రక్షిత్ శెట్టి ట్వీట్ చేయగా.. ఇప్పుడు ఎలాంటి అనౌన్మెంట్ లేకుండానే స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Also read: Tillu Square: టిల్లు స్క్వేర్ రిలీజ్ డేజ్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ టీం

అయితే ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బీ’ కథ విషయానికి వస్తే.. తన ప్రేయసి తో కలిసి సంతోషంగా జీవించాలని.. అందుకు డబ్బు ఉండాలని నిర్ణయించుకున్న హీరో.. చేయని తప్పుకు జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత అనుహ్యంగా అదే కేసులో పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవిస్తాడు. అలా పదేళ్ల తర్వాత బయటకు రావడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. తన ప్రేయసి ప్రియ (రుక్మిణి వసంత్)కు పెళ్లి అయిపోయి ఉంటుంది. దీంతో ఆమెని మర్చిపోలేక హీరో సతమతం అవుతుంటాడు. ప్రేయసిని దూరం నుంచి ఫాలో అవుతూ.. ఆమె కొడుకు, భర్తతో తన గురించి చెప్పకుండా స్నేహం చేస్తాడు. ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తుంటాడు. చివరకు తాను ప్రియను కలిశాడా ?.. అతని జీవితంలోకి వచ్చిన సురభి (చైత్ర జే ఆచార్) ఎవరు ? తనను జైలుకు పంపించిన వారిపై పగ తీర్చుకున్నాడా ? అనేది ఈ చిత్ర కథ. థియేటర్లలో ఎంతగానో అలరించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button