తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Achampeta: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు.. వీడియో వైరల్

బీఆర్ఎస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం మొదటిసారిగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద సోమవారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అంతకుముందు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ మీట్, అంబటిపల్లి గ్రామంలో ఆలయంలో నిర్వహించనున్న ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గువ్వల పర్యటనలను అడ్డుకోవాలని పిలుపునిచ్చాయి.

ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్… పోలీసుల నిఘా నీడలో పబ్బులు

బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట పర్యటనకు వెల్దండ మీదుగా వెళ్లేందుకు బయలుదేరారు. దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వెల్దండ పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button