తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Exit Polls: సర్వేలన్నీ కాంగ్రెస్ కే పట్టం.. 9న సర్వం సిద్ధం

తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. అధికారం చేపట్టేందుకు పూర్తి మెజార్టీ హస్తం పార్టీ సొంతం చేసుకుంటాయని తేల్చి చెప్పాయి. దాదాపు అన్ని మీడియా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేల్లో ఈ ఫలితాలు వచ్చాయి. ఏ ఒక్క సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కుతుందని చెప్పలేకపోయింది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. దశాబ్ద కాలం అనంతరం అధికారం దక్కనుండడంతో హస్తం పార్టీ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని ప్రచారం జరుగుతున్నట్టే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లోనూ అటువైపే గాలి వీచింది. మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయో లేదో అనేది ఈనెల 3వ తేదీన తెలియనుంది.

Also Read పోల్ స్ట్రాటేజీ గ్రూప్ ఎగ్జిట్ ఫలితాలు ఇవే.. మిగతావి

తెలంగాణ ఇచ్చిన.. తెచ్చిన పార్టీగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్లు తెలుస్తోంది. దీనికితోడు పదేళ్లుగా సీఎం కేసీఆర్ అవినీతి, ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చెప్పవచ్చు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 70కి పైగా స్థానాల్లో హస్తం హవా కొనసాగిస్తుందని సర్వే ఫలితాలు పేర్కొన్నాయి. ఆరు గ్యారంటీలు, మేనిఫెస్టో కూడా ఆ పార్టీ పుంజుకోవడానికి దోహదం చేసిందని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవమైతే ప్రకటించినట్లుగానే డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారం చేపట్టవచ్చు.

Also Read: తెలంగాణ ఎన్నికలకు సినీ‘ముడుపులు’, ఆ ‘మైత్రి’ దేనికోసమో?

ఎగ్జిట్ పోల్ ఫలితాలు

సీఎన్ఎన్: బీఆర్ఎస్ పార్టీ: 48, కాంగ్రెస్: 56, బీజేపీ: 10, ఎంఐఎం: 5
జన్ కీ బాత్: బీఆర్ఎస్ పార్టీ: 40-55, కాంగ్రెస్: 48 -64, బీజేపీ: 7 -13, ఎంఐఎం: 4 -7
చాణక్య స్ట్రాటజీస్: బీఆర్ఎస్ పార్టీ: 21- 31, కాంగ్రెస్: 67-78, బీజేపీ: 6-9, ఎంఐఎం: 6-7
ఆరా సంస్థ: బీఆర్ఎస్ పార్టీ: 41- 49, కాంగ్రెస్: 58- 63, బీజేపీ: 5 -7, ఇతరులు: 7- 9
పీపుల్స్ పల్స్: కాంగ్రెస్: 62-72, బీఆర్ఎస్ పార్టీ: 35- 46, ఎంఐఎం 6- 7, బీజేపీ 3 -8, ఇతరులు 1- 2
ఇండియా టీవీ: బీఆర్ఎస్ పార్టీ: 31- 47, కాంగ్రెస్: 63- 79, బీజేపీ: 2 -4, ఇతరులు: 5-7
పోల్ స్టాట్: బీఆర్ఎస్ పార్టీ: 48- 58, కాంగ్రెస్: 49- 59, బీజేపీ: 5 -10, ఇతరులు: 6- 8
స్మార్ట్ పోల్: బీఆర్ఎస్ పార్టీ: 24- 36, కాంగ్రెస్: 70- 82, బీజేపీ: 3 -8, ఇతరులు: 6-8
రిపబ్లిక్ టీవీ: బీఆర్ఎస్ పార్టీ: 46- 56, కాంగ్రెస్: 58- 68, బీజేపీ: 4 -9, ఇతరులు: 5-7
రేస్: బీఆర్ఎస్ పార్టీ: 45- 51, కాంగ్రెస్: 57- 67, బీజేపీ: 1-5, ఇతరులు: 6-7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button