తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Assembly: హరీశ్ రావు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని… నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్త ముఖ్యమంత్రికి విషయం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుందని చురక అంటించారు. కాళేశ్వరం కార్పోరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయలేదని… పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామని స్పష్టం చేశారు.

Also Read: త్వరలో 2,500 కొత్త బస్సులు.. ఒరిజినల్ కార్డు ఉండాలని టీఎస్ఆర్టీసీ కీల‌క ప్రకటన

హరీశ్ రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 2014 నుంచి 2016 వరకు హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారని, ఆ తర్వాత కేసీఆర్ వద్ద ఆ శాఖ ఉందని గుర్తు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు వారి కుటుంబం తప్ప మరొకరు చేయలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 80 వేల కోట్లు మాత్రమే కాదన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్‌కు 97,449 కోట్లు, ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు చేసిందన్నారు. కానీ హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button