![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/bonalu-780x470.webp)
తెలంగాణ రాష్ట్ర పండుగ ‘బోనాల జాతర’ షురూ కానుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది. అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. జూలై 7న ఆషాఢ మాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు.
ALSO READ: వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ?
ఆగస్టు 4న ముగింపు
జూలై 7వ తేదీ ఆదివారం – గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 11 గురువారం – రెండవ పూజ, జూలై 14 ఆదివారం – మూడవ పూజ కాగా.. జూలై 18 గురువారం – నాల్గవ పూజ నిర్వహిస్తారు. జూలై 21 ఆదివారం – ఐదవ పూజ, జూలై 25 గురువారం – ఆరోపూజ, జూలై 28 ఆదివారం – ఏడవ పూజ కాగా.. ఆగస్ట్ 1 గురువారం – ఎనిమిదవ పూజ అనంతరం.. ఆగస్టు 4 ఆదివారం – తొమ్మిదవ పూజ చేస్తారు. అంటే జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయి.
k8fvqv