తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS: బీఆర్ఎస్ కు వరుస షాకులు.. కారు దిగిన కీలక నేతలు

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆపార్టీ కీలకంగా ఉన్న పలువురు నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మాజీ మంత్రి రాజయ్య కాంగ్రెస్ లోకి వెళ్లారు. అలాగే పలువురు ఎమ్మెల్సీలు, కీలక నేతలు కారు దిగుతున్నారు. తాజాగా.. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సహా.. మరో నలుగురు కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు.

Also read: CM Revanth: బీసీల బాగుకోసమే కులగణన.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో వాళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ అనితారెడ్డి కూడా హస్తం పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు.

ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పటి నుంచి వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సునీతా మహేందర్ రెడ్డికి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button