తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్… ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడి…అనంతరం ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు.

Also Read: జనసేనానికి హరిరామ జోగయ్య లేఖ… పలు అంశాలపై పవన్‌కు ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి… తన పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button