తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Varun Kumar: భారత స్టార్ క్రీడాకారుడిపై పోక్సో కేసు.. గాలిస్తున్న పోలీసులు

భారత హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. గత ఐదేళ్లుగా వరుణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులతో అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరు పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది.

ALSO READ: వైజాగ్ టెస్టులో 45 ఏళ్ల రికార్డు బద్దలు.. సత్తాచాటిన రవిచంద్రన్ అశ్విన్

పెళ్లి చేసుకుంటా.. అని చెప్పాడు

2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో వరుణ్‌ కుమార్‌‌తో పరిచయమైనట్లు ఆమె పేర్కొంది. తర్వాత బెంగుళూరుకు మ్యాచ్ల కోసం వచ్చినప్పుడు కలిసేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఈ సమయంలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే దూరం పెడుతున్నట్లు.. నా వయస్సు ప్రస్తుతం నా వయస్సు 22 ఏళ్లు అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ప్రస్తుతం వరుణ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button