తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: కేసీఆర్ పాలనలో ప్రజలు నోచుకొని రేషన్ కార్డులు… మరి పథకాలు పొందేదెలా?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోట్లాడి, ఎందరో అమరవీరుల త్యాగల ప్రతిఫలంగా రాష్ట్రం ఏర్పడింది. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు దఫాలుగా పట్టం కట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలు, అభివృద్దిని గాలికి వదిలేసి తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తుందని రాజీకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. దీనికి రీజల్ట్ డిసెంబర్ 3 న వెల్లడించే ఎన్నికల ఫలితాలలో కనిపిస్తుందని… అధికార పార్టీ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశలు మెండుగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

రేషన్ కార్డు లేకపోవడం వల్ల నష్టపోతున్న ప్రజలు

ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డు అవసరమని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో ఎన్నో సంక్షేమ పథకాలు అందకుండా నిరాశ చెందుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ పదేళ్లలో ఎంతో మంది జన్మించి ఉండవచ్చు, అలాగే మ్యారేజ్ అయినా వాళ్లు ఉండచ్చు, ఇంక ఎన్నో రకాలుగా ఎందరో ఉండచ్చు వీరద్దరికి రేషన్ కార్డులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలను ప్రవేశపెడితే ఏముంది అవి ప్రజలకు అందనప్పుడు.

ఒక్క రేషన్ కార్డు పై ఒక్కరే అర్హులు

ఈ విషయంతో ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎప్పటి పథకాల గురించో మాట్లాడటం ఎందుకు ఎలక్షన్స్ లో ఓట్ల కోసం ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన బీసీ బంధు, గృహాలక్ష్మీ గురించే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ రెండు పథకాలు ఆప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు అవసరం. కానీ ఒకే ఇంటిలో పెండ్లైన వారు ఒకరు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వారి పరిస్థితి ఏంటి? అన్ని అర్హతలు ఉన్న ఆప్లై చేసుకోలేని పరిస్ధితి. ఎందుకంటే ఒక్క రేషన్ కార్డు పై ఒక్కరే అర్హులు కాబట్టి. అలా కాదని ఇంట్లో ఉన్న వారిలో ఎవరో ఒకరు అప్లై చేసుకోని డబ్బులు వస్తే వాటి గురించి అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగిన సందర్బలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

మ్యానిఫెస్టోలో సన్నబియ్యం హామీ

ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామంటూ మ్యానిఫెస్టో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంపై కేసీఆర్ ను నమ్మే అవకాశమే లేదని అధికారంలోకి వచ్చి ఇన్ని ఏండ్లు గడుస్తున్న రేషన్ కార్డులే ఇచ్చే దిక్కులేదు కానీ సన్నబియ్యం అంటే ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. అసలు మాకు రేషన్ కార్డులే లేనప్పుడు బియ్యం ఎవరికి ఇస్తావని నిలదీస్తున్నారు. గతంలో కూడా రైతులను సన్నబియ్యం పండించాలని ప్రోత్సాహించిన సీఎం కేసీఆర్… పంట వేసిన రైతులు సరియైన దిగుబడి, మద్దతుధర సరిగ్గా రాకపోవడంతో అప్పులపాలైన వారు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

బీఆర్ఎస్ పై మండిపడుతున్న కాంగ్రెస్

వీటన్నింటికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలు ఎలా ఉన్న బీఆర్ఎస్ హయాంలో మన రాతలు మారుతాయని చాలా మంది ఆశించారు. కానీ అంతకంతకు దిగజారిపోయింది .ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ప్రత్యేక తెలంగాణలో బాగుపడింది కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే అని విమర్శిస్తున్నారు. కోట్లకు కోట్లు దొబ్బెసి తెలంగాణను మాత్రం అప్పులపాలు చేశారంటూ నిందిస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలేదంటూ మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button