తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth Reddy: ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ పర్యటన.. కాంగ్రెస్ గ్యారంటీలపై కీలక ప్రకటన

ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ త్వరలో లక్షమంది మహిళలకు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ త్వరలోనే అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ ప్రకటించారు. గూడేలకు రోడ్లు, నాగోబా అభివృద్ధి కోసం పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకి రూ.5 లక్షలు ఇచ్చి అండగా నిలిచామని.. కేసీఆర్ 10 ఏళ్లలో ఆదివాసీల గురించి ఒక్క రోజైనా ఆలోచించావా అని ప్రశ్నించారు.

Also read: Bharat Rice: సామాన్యూలకు గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే రూ. 29కి బియ్యం

తోటల్లో అడవి పందులు పడి ఎలా విధ్వంసం చేస్తాయో అలా రాష్ట్రాన్ని కేసీఆర్ వాళ్ల కుటుంబం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మీరు నీళ్ళు ఇస్తే 65 వేల కోట్లు నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది అని ప్రశ్నించారు. నీ బిడ్డలు, నీ దోపిడీ, ఫార్మ్ హౌస్ ఎలా కట్టాలని ఆలోచించావు తప్పా.. ప్రజల కోసం ఆలోచించలేదని మండిపడ్డారు. 7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు తాము ఇచ్చామన్నారు. నిరుద్యోగుల బాధ చూడలేక కోర్టుల్లో ఉన్న కేసుల్ని పరిష్కరించే ప్రయత్నం చేశామని తెలిపారు.

ఇక రాబోయే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రెండు నెలలు కాలేదు.. ఇప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదు అంటున్నారన్నారు. కడెం రిపేర్ చేస్తాం.. సదర్మాట్, కుప్టి నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చావా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడతా అంటున్నారు.. ఎవ్వడు వచ్చేది.. ప్రజల ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వం అన్నారు. కాళేశ్వరం గాలికి పోయింది.. నువ్వు నీ ఖానదాన్ వచ్చినా ఏం చేయలేరని మండిపడ్డారు. జన్మలో మళ్లీ కేసీఆర్ సీఎం కాలేడని విమర్శించారు. మతం పేరుతో ఒకరు.. మద్యం పేరుతో మరొకరు వస్తారు.. ప్రతీ తండా, గూడెంలో రోడ్లు వేసే బాధ్యత తమదని సీఎం తెలిపారు. రాహుల్ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button