తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth: మేడారం పోస్టర్ ఆవిష్కరణ… సీఎంను కలిసిన పూజారుల సంఘం సభ్యులు

సమ్మక్క సారక్కల జాతరను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మేడారం మహా జాతర పోస్టర్ ను డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23న మేడారం జాతర కు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి మేడారం పూజారుల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు.

Also Read: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలకు లక్ష, తులం బంగారం

ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కి ఆహ్వానం అందింది. మేడారం ఆలయ పూజారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను సచివాలయంలో అందజేసింది. వచ్చే నెలలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, సంబంధిత పనులపై దేవాదాయశాఖ అధికారులు సీఎం రేవంత్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ సమక్షంలో మేడారం జాతర పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

Also Read: ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ.. పలు రాష్ట్రాలకు ఇంఛార్జుల నియామకం

ఇక నిన్న మేడారం జాతర పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా ఎస్పీ శబరిష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో మొదటగా వీఐపీ పార్కింగ్ స్థలాన్ని , ఆర్టీసీ బస్ స్టాండ్ , హరిత హోటల్ , జంపన్న వాగు స్తాన ఘటలు, స్థూపం రోడ్ , కొత్తూరు సమీపంలో మరుగు దొడ్ల పనులను పరిశీలించారు. ఆ తరువాత కన్నేపల్లి గ్రామం లోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button