తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలను స్వీకరించిన వెంటనే అందరూ కూడా తమ కార్యాచరణను మొదలు పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. మధిర నియోజకవర్గం ప్రజల అండతోనే తాను ఉన్నతమైన పదవిని చేపట్టానని చెప్పారు. ఒక చారిత్రక విజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు.

Also Read: డిసెంబర్ 17 న నాలుగు పరీక్షలు… గందరగోళంలో అభ్యర్థులు

ప్రతిఒక్కరూ స్వేచ్చగా ఉండచ్చు

ఇది ప్రజల ప్రభుత్వం, రాహుల్ గాంధీ చెప్పినట్లుగా అన్ని హామీలను అమలు చేస్తాం, సంపాదను సృష్టిస్తామన్నారు. మహిళలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వం అమలు చెయ్యలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్చగా బ్రతకోచ్చని, ఎలాంటి నిర్భంధాలు ఉండవని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 10 కి 9 స్ధానాలలో ప్రజలు గెలించారని గుర్తుచేశారు. ప్రజలు ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అధికారులు ప్రజల ఇంటికి వచ్చి పనులు చేస్తారని తెలిపారు.

Also Read: ‘‘రేవంత్‌ అన్నా.. మీతో మాట్లాడాలి’’ మహిళ పిలుపు… స్పందించిన సీఎం

బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తమే

ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తమే అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందని దుయ్యబట్టారు. నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పని చేసేలా చేస్తామని చెప్పారు.

Also Read:  రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం… వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం రద్దు

100 రోజుల్లో 6 గ్యారెంటీలు

ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను కేవలం రెండు రోజుల్లోనే ప్రారంభించామని భట్టి తెలిపారు. 100 రోజుల వ్యవధిలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. ఐటీ, పరిశ్రమలు, సేవా రంగాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రజా దర్బార్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదన్న బీఆర్ఎస్ పెద్దలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button