తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం… సీఎం ఎవరంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. హస్తం పార్టీ 64 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. ఈ మార్కు కంటే కాంగ్రెస్ మరో 4 సీట్లు ఎక్కువే గెలిచింది.

Also Read: తెలంగాణలో ప్రభావం చూపించని పవన్… డిపాజిట్లు గల్లంతు

తాజ్ కు చేరుకుంటున్న ఎమ్మెల్యేలు

ఈ నేపథ్యంలో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించేందుకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకుంటున్నారు. ఈ రాత్రికి కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఏఐసీసీ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.

Also Read:  మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు.. ఎవరంటే?

రేసులో ముఖ్యనాయకులు

అలాగే మొన్నటి వరకు సీఎం రేసులో ఉన్న వారి పేర్లు చాలానే వినిపించాయి. కానీ ఇప్పుడు ముఖ్యంగా మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు మీడియాతో తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడిగా, అంతా తానై ఎన్నికల ముందు సభలు, సమావేశాలతో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి కూడా సీఎం కావాలనుకుంటున్నట్లు సమాచారం. మరి చూడాలి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరిని సీఎం సీటు పై కూర్చోబెడుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button